సీబీఆర్‌ఈ ప్రాపర్టీ షో షురూ!
నేడు, రేపు కూడా అందుబాటులో..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తొలిసారిగా సీబీఆర్‌ఈ ప్రాపర్టీ షోను నిర్వహించింది. 3 రోజుల ఈ షో శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. 2016లో నగరంలో కార్యాలయాల స్థలానికి 109 శాతం గిరాకీ పెరిగిందని సీబీఆర్‌ఈ ఇండియా, సౌత్‌ఈస్ట్ ఏసియా చైర్మన్ అన్షుమన్ చెప్పారు.
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలల్లో నగరంలో 13 లక్షల చ.అ. కార్యాలయాల స్థలం లీజుకు తీసుకున్నారని తెలిపారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నేటికీ ధరలు అందుబాటులో ఉన్నాయని.. ఇదే నివాస సముదాయాల డిమాండ్‌కు కారణమని సీబీఆర్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ హెడ్ ఏఎస్ శివరామకృష్ణన్ చెప్పారు. నగరంలోని 60 నిర్మాణ సంస్థలు, 200 ప్రాజెక్ట్‌లను షోలో ప్రదర్శించారు. తొలిరోజు 5 వేల మంది సందర్శకులొచ్చారని.. మూడు రోజుల ఈ షోలో మొత్తం 15 వేల మంది హాజరవుతారని అంచనా వేశారు.