న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రుణ భారం 2017 డిసెంబర్ ముగింపు నాటికి రూ.66.61 లక్షల కోట్లకు పెరి గింది. ప్రభుత్వ రుణ భారం (పబ్లిక్ అకౌంట్ కింద ఉన్న రుణాలను మినహాయిస్తే) ఈ ఆర్థిక సం వత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.65.80 లక్షల కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికం లో రుణ భారం 1.22% పెరిగింది.
ఈ గణాంకాలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,64,000 కోట్ల మేర డేటెడ్ సెక్యూరిటీలు (నిర్ణీత కాలంలో తిరిగి చెల్లించాల్సినవి) విడుదల చేసింది. రెండో త్రైమాసికంలో విడుదల చేసిన రూ.1,89,000 కోట్ల కంటే తక్కువే. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన డేటెడ్ సెక్యూరిటీల మొత్తం విలువ రూ.5,21,000 కోట్లు’’ అని ఆర్థిక శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment