రింగింగ్ బెల్స్‌పై చీటింగ్ కేసు..!
న్యూఢిల్లీ: కేవలం రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని ప్రకటించి కొన్ని కోట్ల విలువైన పబ్లిసిటీని ఉచితంగా పొందిన రింగింగ్ బెల్స్ కంపెనీ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకుంది. ‘సైఫ్యూచర్’ సంస్థ రింగింగ్ బెల్స్ కంపెనీపై చీటింగ్ కేసు పెట్టే యోచనలో ఉంది. సైఫ్యూచర్ సంస్థ డేటా, బీపీవో సర్వీసులను అందిస్తుంది. రింగింగ్ బెల్స్ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు సంబంధించి భారత్‌లో కాల్ సెంటర్ సేవలను అందించడానికి సైఫ్యూచర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
రింగింగ్ బెల్స్ కంపెనీ తమకు చెల్లించాల్సిన డబ్బుల్ని చెల్లించడం లేదని, ఇదేంటని అడిగితే సేవలు బాగోనందున, కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు రింగింగ్ బెల్స్ తెలిపిందని సైఫ్యూచర్ సంస్థ సీఈవో అనుజ్ బైరథి తెలిపారు. అయితే తమ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇలా ఏడాదిలోపు , ఎటువంటి నోటీసూ లేకుండా అర్థాంతర కాంట్రాక్టు రద్దు కుదరదని పేర్కొన్నారు.