
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐసీఎల్ ఫిన్‌కార్ప్ 2022 నాటికి రూ.5,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. కేరళకు చెందిన ఈ కంపెనీ 2018–19లో రూ.700 కోట్లకుపైగా టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లకు చేరుకుంటామని కంపెనీ సీఎండీ కె.జి.అనిల్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో ప్రస్తుతం 157 శాఖలను నిర్వహిస్తున్నాం. మూడేళ్లలో 1,000 శాఖల స్థాయికి చేరతాం. 927 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను 5,000లకు పెంచుతాం. లిస్టెడ్ కంపెనీ అయిన సాలెం ఈరోడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేస్తున్నాం. ప్రమోటర్లకున్న 74.27 శాతం వాటా కొనుగోలుకు షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. అలాగే మార్చిలోగా ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.100 కోట్లు సమీకరించనున్నాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment