సిటీలో బస్‌ జర్నీ.. సో ఈజీ | Commute.com Mini Bus Service | Sakshi
Sakshi News home page

సిటీలో బస్‌ జర్నీ.. సో ఈజీ

Published Sat, Aug 19 2017 12:56 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

సిటీలో బస్‌ జర్నీ.. సో ఈజీ

సిటీలో బస్‌ జర్నీ.. సో ఈజీ

హైదరాబాద్‌లో మినీ బస్సు సర్వీసులందిస్తున్న కమ్యూట్‌
► కి.మీ.కు రూ.3 చార్జీ; రోజుకు 2 వేల మంది ప్రయాణం
► ప్రస్తుతం 75 మినీ బస్సులు;  2 నెలల్లో 200 వాహనాల లక్ష్యం


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో రోజూ 30 కి.మీ. దూరంలో ఉన్న ఆఫీసుకు వెళ్లి రావాలంటే? బస్సులో అయితే గంటల తరబడి ప్రయాణం, సీటుకు నో గ్యారంటీ! పోనీ, ఓలా లేదా ఉబర్‌ వంటి క్యాబ్‌లను బుక్‌ చేద్దామంటే సర్‌చార్జీ పేరిట జేబు గుళ్ల!
పోనీ, బైక్‌ మీద వెళ్దామంటే గతుకుల రోడ్లు, ట్రాఫిక్‌! మరెలా? వీటన్నింటికీ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అందిస్తోంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌.. కమ్యూట్‌.కామ్‌. ప్రయాణ సమయం, స్థలం ఎంపిక చేస్తే చాలు.. ఇంటికొచ్చి మిమ్మల్ని పికప్‌ చేసుకొని గమ్య స్థానంలో చేరవేయటం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు కమ్యూట్‌.కామ్‌ కో–ఫౌండర్‌ చరణ్‌ మాటల్లోనే..

కమ్యూట్‌.కామ్‌ ఫౌండర్లలో నాతో పాటూ హేమంత్‌ జొన్నలగడ్డ, ప్రశాంత్‌ గారపాటి, సందీప్‌ కాచవరపు, అక్షయ్‌ చిన్నుపాటి, శృజయ్‌ వరికుట్టి కూడా ఉన్నారు. 2015 నవంబర్‌లో కమ్యూట్‌.కామ్‌ ప్రారంభమైంది. బుకింగ్‌ చాలా ఈజీ..: కమ్యూట్‌ బస్‌లో ప్రయాణం బుకింగ్‌ చేసుకునే విధానం కూడా చాలా సులువు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్స్, వెబ్‌సైట్‌ నుంచి కూడా బుక్‌ చేసుకోవచ్చు. ముందుగా కమ్యూట్‌.కామ్‌కు లాగిన్‌ అయి.. రిజిస్టర్‌ చేసుకోవాలి.  తర్వాత పేరు, ఫోన్‌ నంబర్, పికప్, డ్రాపింగ్‌ పాయింట్ల, సమయాన్ని ఎంచుకొని కమ్యూట్‌ వ్యాలెట్‌ నుంచి చార్జీలు చెల్లిస్తే చాలు. ఆఫీసు సమయాల్లో అంటే ఉదయం 7 నుంచి 11 మధ్య, సాయంత్రం 5 నుంచి 8 మధ్య ప్రతి 15 నిమిషాలకొక బస్సును నడుపుతున్నాం. మిగిలిన సమయాల్లో అరగంటకొక బస్సు నడుస్తుంది.

50 రూట్లు, 75 మినీ బస్సులు..
ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, బాచుపల్లి వంటి నగరం మొత్తం 50 రూట్లలో బస్సులను నడుపుతున్నాం. 12, 15, 21 సీట్ల మినీ బస్సులు 75 వరకూ వున్నాయి. 45 వేల మంది రిజిస్టర్‌ యూజర్లున్నారు. ఇప్పటివరకు 4.5 లక్షల మంది మా సేవలను వినియోగించుకున్నారు. రోజుకు 2 వేల మంది మా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. 75–80 ఆక్యుపెన్సీ ఉంటుంది. రోజుకు వాహనాలన్నీ కలిపి 6 వేల కి.మీ. తిరుగుతున్నాయి. కి.మీ.కు రూ.3 చార్జీ ఉంటుంది. వారం, నెలవారీగా కూడా ప్యాకేజీలుంటాయి. వీటికి ఆఫర్లు, డిస్కౌంట్లుంటాయి.

ఏడాది ముగింపు నాటికి నిధుల సమీకరణ..
ప్రతి నెలా 20%ఆదాయ వృద్ధిని సాధిస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులున్నారు.  ‘‘ఇటీవలే హెచ్‌2ఓ క్యాబ్స్‌ను కొనుగోలు చేశాం. 2 నెలల్లో 200 వాహనాలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ఇప్పటికి 50కే వెంచర్స్‌ నుంచి రూ.1.3 కోట్ల నిధులను సమీకరించాం. ఈ ఏడాది చివరకల్లా మరో విడత నిధులను సమీకరించనున్నాం.  తర్వాతే ఇతర నగరాలకు విస్తరిస్తామని’’ చరణ్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement