సాక్షి, మహబూబాబాద్: ఆర్టీసీ మినీ బస్సుల్లో స్టూడెంట్ పాస్‌లు చెల్లుబాటుకావడం లేదు. మినీ పల్లెవెలుగు పేర గ్రామాలకు బస్సులు నడుపుతున్నప్పటికీ పాస్‌లు చెల్లుబాటు కాకపోవడంతో విద్యార్థులు నానాఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ ఇటీవల రాష్ట్రంలోని 9 రీజియ న్ల పరిధిలో 320 మినీ బస్సులను ప్రవేశపెట్టింది. ఒక్కో బస్సు సీట్ల సామర్థ్యం 30. నాన్ కండక్డర్ సర్వీసు. డ్రైవరే టిమ్ యంత్రంతో టికెట్లు జారీ చేస్తూ మినీ బస్సులను నడిపిస్తున్నారు. పల్లె వెలుగు పేరుతోనే గ్రామాలకు ఈ బస్సులను నడుపుతున్నప్పటికీ స్టూడెంట్ పాసులు చెల్లవంటూ బోర్డులో పెట్టుకొని ఈ బస్సులను తిప్పుతున్నారు. దీంతో విద్యార్థులు ఆర్టీసీ ఆర్డినరీ బస్సు వచ్చేంత వరకు వేచిచూడాల్సి వస్తోంది. కొంద రు చార్జీలు పెట్టు కొని బస్సులు, ఆటోల్లో వస్తున్నారు.
ప్రయాణికుల కోసమే..
మినీ బస్సులో ఉండేది 30 సీట్లే. అవి ప్రయాణికులకే కేటాయించాం. విద్యార్థుల కోసం ఆర్డినరీ బస్సులు ఎలాగూ ఉన్నాయి. వాటిలో పాసులు చెల్లుబాటు అవుతున్నాయి. మినీ బస్సులను ఏర్పాటు చేసినా ఆర్డినరీ పల్లెవెలుగు బస్సులను అలాగే తిప్పుతున్నాం. ట్రిప్పులను కూడా ఏ మాత్రం తగ్గించలేదు.
– కె.రవిప్రసాద్, డీఎం, మహబూబాబాద్
ఆటోలో వస్తున్నా..
మాది గార్ల మండలం సీతంపేట. మానుకోటలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నా. రోజూ ఎక్స్‌రోడ్డు వద్దకు వచ్చి బస్సెక్కాలి. గతంలో ఇల్లెందుకు ఆర్డినరీ బస్సులు ఎక్కువ నడిచేవి. ఇప్పుడు మినీ బస్సులు ఎక్కువ తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో స్టూడెంట్ పాస్‌లు చెల్లవంటూ ఎక్కనివ్వటం లేదు. ఆర్డినరీ బస్సు కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే కాలేజీ సమయానికి వెళ్లలేం. దీంతో చార్జీ పెట్టి ఆటోలో వెళ్తున్నా.
– ఎం.సాయికుమార్, ఇంటర్ విద్యార్థి, గార్ల
Comments
Please login to add a commentAdd a comment