డీఎల్ఎఫ్ కు 630 కోట్ల జరిమానా!
డీఎల్ఎఫ్ కు 630 కోట్ల జరిమానా!
Published Wed, Aug 27 2014 3:03 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ కు సుప్రీం కోర్టు బుధవారం భారీ జరిమానా విధించింది. గుర్గావ్ లోని మూడు ప్రాజెక్టుల్లో తన కస్టమర్లను మోసగించారనే ఆరోపణలపై డీఎల్ఎఫ్ కంపెనీకి 630 కోట్ల జరిమానాను విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 630 కోట్ల రూపాయలపై 170 కోట్ల రూపాయల వడ్డీని కూడా చెల్లించాలని జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, ఎన్ వీ రమణలు తీర్పు నిచ్చారు.
మూడు వారాల్లోగా 50 కోట్లు, మిగితా 580 కోట్ల రూపాయలను మూడు నెలల్లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని జాతీయ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని రిజిస్త్రీకి కోర్టు సూచించింది.
Advertisement
Advertisement