డీజిల్ ధర లీటరుకు రూ. 2.50 తగ్గే అవకాశం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించడంతో డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. లీటర్ డీజిల్ ధర 2.50 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండటం కారణంగా డీజిల్ రేటు తగ్గింపుకు అవరోధంగా మారింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని డీజిల్ ధరల తగ్గింపు అంశంపై పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.