జోరుగా డిజిటల్ లావాదేవీలు
నీతి ఆయోగ్ వెల్లడి
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలు గత నెలలో జోరుగా పెరిగాయని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ ఏడాది మార్చిలో డిజిటల్ లావాదేవీలు 23 రెట్లు పెరిగి 64 లక్షలకు చేరాయని, వీటి విలువ రూ.2,425 కోట్లని పేర్కొంది. పెద్ద నోట్లు రద్ద యిన గతేడాది నవంబర్ నెలతో పోల్చితే డిజిటల్ లావాదేవీలు జోరుగా పెరిగాయాని నీతి ఆయోగ్ పేర్కొంది. నీతి ఆయోగ్ వివరాల ప్రకారం..
⇒ గతేడాది నవంబర్‌లో 2.8 లక్షల డిజిటల్ లా వాదేవీలు జరిగాయి. విలువ రూ.101 కోట్లు.
⇒ గత ఏడాది నవంబర్లో 2.5 కోట్లుగా ఉన్న ఆధార్ ఎనేబుల్డ్ చెల్లింపులు ఈ మార్చిలో 5 కోట్లకు పైగా పెరిగాయి.
⇒ ఐఎంపీఎస్ లావాదేవీలు 3.6 కోట్ల నుంచి 6.7 కోట్లకు వృద్ధి చెందాయి.
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,500 కోట్ల డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న వాటిల్లో 75 టౌన్‌షిప్స్‌ను లెస్–క్యాష్ టౌన్‌షిప్స్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టౌన్ షిప్స్‌ల్లో డిజిటల్ చెల్లింపుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పా టు చేయడం పూర్తి చేశారు. ఈ టౌన్‌షిప్‌ల్లో ఉన్న కుటుంబాలన్నింటికీ డిజిటల్ చెల్లింపుల విషయంలో తగిన శిక్షణను ఇచ్చారు.