ఎమర్జింగ్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ? | Donald Trump’s tax cut may hit emerging markets | Sakshi
Sakshi News home page

ఎమర్జింగ్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ?

Published Thu, Apr 27 2017 5:09 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

ఎమర్జింగ్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ? - Sakshi

ఎమర్జింగ్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ?

ముంబై : అమెరికా అధ్యక్షుడు బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్ ప్లాన్ ను బుధవారం విడుదల చేశారు. ఈ ట్యాక్స్ కట్ ప్లాన్ అమెరికా కంపెనీలకు మేజర్ బూస్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఎమర్జింగ్ మార్కెట్లపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతమున్న ఏడు ట్యాక్స్ బ్రాకెట్లను మూడింటికి కుందించింది.

దీంతో పబ్లిక్ కార్పొరేషన్లకు విధించే పన్ను రేట్లు 35 శాతం నుంచి 15 శాతానికి దిగొచ్చాయి. అంతేకాక, చిన్న వ్యాపారాలకు 39.6 శాతం పన్ను రేటు, 15 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే విదేశాల్లో లాభాలు ఆర్జించి వాటిని దేశానికి తీసుకురావాలంటే మాత్రం 15 శాతం పన్నును భరించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు కనుక ఒకవేళ చట్టపరమైతే, ఎక్కువగా పన్నులు వేస్తున్న 20 దేశాల జాబితాల్లో తక్కువ పన్ను కలిగిన దేశంగా అమెరికా చరిత్రలోకి  ఎక్కనుంది. 
 
దీంతో అమెరికా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారుతుందని,  ఇన్వెస్టర్లందరూ ఆ దేశంవైపు చూస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ కూడా బలపడనుందని వెల్లడవుతోంది. అనుకున్నంత మేర భారత్ కు దెబ్బతగలన్నప్పటికీ,  ఇతర వర్ధమాన దేశాలకు మాత్రం నష్టమేనని ఐసీఐసీఐ సెక్యురిటీస్ లిమిటెడ్ రవి సుందర్ ముత్తుక్రిష్ణన్ తెలిపారు. పన్ను కోతతో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలున్నాయని ఇన్ప్లోలన్నీ అమెరికాకు వెళ్తాయని ఆయన చెప్పారు. కేవలం ఒక్క పేజీలోనే ట్రంప్ కార్యాలయం ఈ ప్రతిపాదనలను విడుదల చేసింది.

అయితే సమగ్ర సమాచారం ఇవ్వడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమై, పెట్టుబడిదారులను నిరాశపరిచింది. మరోవైపు అమెరికా కంపెనీలకు ఎక్కువ లాభాలు, ఎమర్జింగ్ మార్కెట్లలో పెట్టుబడులకు దోహదం చేస్తాయని మైనార్టి కాంట్రారియన్ సిద్ధాంతం చెబుతోంది. ఇది సానుకూల సంస్కరణ అని పేర్కొంటోంది. అయితే ట్రంప్ ట్యాక్స్ కట్ ప్లాన్ పెట్టుబడిదారులను నిరాశపరచడంతో, రెండేళ్ల గరిష్టంలో ఎగిసిన ఆసియన్ షేర్లు జోరు తగ్గించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement