హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫాండాపారినక్స్ సోడియం జెనరిక్ డ్రగ్‌పై ప్రపంచవ్యాప్తంగా మేధోసంపత్తి హక్కులను డాక్టర్ రెడ్డీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాకి చెందిన ఆల్కెమియా నుంచి ఈ హక్కులను రూ. 115 కోట్లకు ( 17.5 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నరాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి వినియోగించే ఆరిక్సట్రాక్ ఔషధానికి ఫాండాఫారినక్స్ జెనరిక్ రూపం. సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ ఒప్పందానికి నవంబర్ 10న జరిగిన ఆల్కెమియా వాటాదారులు సమావేశంలో ఆమోదం తెలిపినట్లు కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం జూలై, 2015 నుంచి అమల్లోకి వచ్చింది.
డాక్టర్ రెడ్డీస్ చేతికి ఫాండాపారినక్స్ హక్కులు
Published Thu, Nov 19 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM
Advertisement
Advertisement