హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లి వద్ద ఉన్న ఫార్ములేషన్స్ తయారీ యూనిట్–2కు జీఎంపీ ధ్రువీకరణను పునరుద్ధరించలేదు. ఈ మేరకు జర్మనీలోని రెడ్డీస్ అనుబంధ కంపెనీ అయిన బెటాఫార్మ్‌కు సమాచారం ఇచ్చింది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో యూనిట్–2 నుంచి యూరోపియన్ యూనియన్‌కు ఔషధ ఎగుమతులు చేయడానికి రెడ్డీస్‌కు వీలు లేకుండా పోయింది. ఇటీవలే ఈ ప్లాంటును జర్మనీ నియంత్రణ సంస్థ తనిఖీ చేపట్టింది. తదుపరి తనిఖీ పూర్తి అయి ఉత్తమ తయారీ విధానాలు (జీఎంపీ) అవలంబిస్తోందంటూ గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు కంపెనీ వేచి చూడాల్సిందే.
రెడ్డీస్‌కు జర్మనీ రెగ్యులేటర్ షాక్
Published Fri, Aug 11 2017 1:34 AM | Last Updated on Mon, Sep 11 2017 11:46 PM
Advertisement