
రాజన్‌తో విభేదించిన దువ్వూరి
ఆర్‌బీఐ గవర్నర్‌కు నైతిక నియమావళి ఉండాలన్న రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయంతో మాజీ గవర్నర్
ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌కు నైతిక నియమావళి ఉండాలన్న రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయంతో మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విభేదించారు. ‘గవర్నర్ ఏ అంశాలపై మాట్లాడాలి అనే విషయంలో నైతిక నియమావళి ఉండాలని నేను అనుకోవడం లేదు. గవర్నర్ సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడాలి... ఇతర అంశాల జోలికి వెళ్లరాదు అంటూ వర్గీకరించడం సూచనీయం కాదు’ అని దువ్వూరి సుబ్బారావు ఇక్కడ జరిగిన తన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చెప్పారు.
రాజన్‌లా ఆర్‌బీఐ గవర్నర్ మేధావి అయినప్పుడు అలాంటి అంశాలపై మాట్లాడడం మంచిదేనని, ఆమోదనీయమేనని అన్నారు. బల మైన ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు మేలు... గొడ్డుమాంసం తిన్నందుకు ఓ మతానికి సంబంధించిన వ్యక్తిని హత్య చేయడాన్ని ఖండించడం వంటి ఎన్నో అంశాలపై రాజన్ తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.