వచ్చే ఏడాదే ఫియట్ జీప్ బ్రాండ్ వాహనాలు
వాషింగ్టన్: ఫియట్ క్రిస్లర్ కంపెనీ రానున్న ఐదేళ్లలో 12 కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తేనున్నది. వీటిల్లో 9 మోడళ్లను భారత్‌లోనే అసెంబుల్ చేస్తామని, మిగిలిన మూడింటిని దిగుమతి చేసుకుంటామని కంపెనీ వివరించింది. వచ్చే ఏడాది నుంచి జీప్ బ్రాండ్ వాహనాలను భారత్‌లోనే తయారు చేయనున్నామని పేర్కొంది. ఈ ఏడాది అబర్త్ బ్రాండ్ వాహనాలు, అబర్త్ 500ను, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫియట్ అవెంచురను మార్కెట్లోకి తెస్తామని వివరించింది. హ్యాచ్‌బాక్ గ్రాండే పుంటో, మీడియమ్ సైజ్ సెడాన్ లినియాను ఈ ఏడాదే అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.
ఇక వచ్చే ఏడాది జీప్ బ్రాండ్‌లో ర్యాంగ్లర్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని వివరించారు. 2018 కల్లా మహారాష్ట్రలోని రాంజన్‌గావ్ ప్లాంట్ నుంచి ఆరు కొత్త మోడళ్లు రానున్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో మూడు మోడళ్లను తయారు చేస్తున్నామని వివరించింది. ప్రస్తుతం డీలర్షిప్‌లు వంద ఉన్నాయని, 2018 కల్లా వీటి సంఖ్యను రెట్టింపు చేయనున్నామని ఫియట్ క్రిస్లర్ కంపెనీ పేర్కొంది.