వృద్ధి ఇంకా మెరుగుపడుతుంది: జైట్లీ
కాన్‌బెర్రా: భారత్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.6 శాతంగా నమోదవుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది మరింత మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత్‌కు చక్కటి ఆర్థిక వృద్ధి సామర్థ్యం ఉందని, ప్రస్తుతం సామర్థ్యంకన్నా తక్కువ వృద్ధిరేటే నమోదవుతోందని చెప్పారాయన. ఇక్కడి ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో గురువారం కేఆర్ నారాయణన్ స్మారక ఉపన్యాసం చేశారు. ‘భారత్‌లో కొత్త ఆర్థిక వ్యవస్థ, అందరికీ భాగస్వామ్యం’ అన్న అంశంపై మాట్లాడారు. పన్ను సంస్కరణలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.