ఆర్బీఐ కొత్త గవర్నర్ను త్వరలో నియమిస్తాం
న్యూఢిల్లీ: రిజర్వ్బ్యాంక్ కొత్త గవర్నర్ నియామకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పనితీరును జైట్లీ ప్రశంసిస్తూనే.. పదవీకాలం అనంతరం మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వెళ్లాలని రాజన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్గా రాజన్ పదవీకాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది.
రెండో విడత ఆర్బీఐ గవర్నర్ పదవిని చేపట్టడానికి రాజన్ విముఖంగా ఉన్నట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. మళ్లీ అధ్యాపక వృత్తిలో వస్తానని సహచరులతో రాజన్ చెప్పినట్టు సమాచారం.