
ఇమ్‌వాంటేజ్ పేమెంట్స్.. అమెజాన్ పరం
ఆన్‌లైన్ చెల్లింపుల సేవలందించే ఇమ్‌వాంటేజ్ పేమెంట్స్ కంపెనీని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది.
ముంబై: ఆన్‌లైన్ చెల్లింపుల సేవలందించే ఇమ్‌వాంటేజ్ పేమెంట్స్ కంపెనీని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ కొనుగోలు కారణంగా వినియోగదారులు చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని అమెజాన్ పేర్కొంది. అయితే ఈ కంపెనీ కొనుగోలుకు ఎంత ధర వెచ్చించింది అమెజాన్ వెల్లడించలేదు. ఈ డీల్‌లో భాగంగా ఇమ్‌వాంటేజ్ ఉద్యోగులు అమెజాన్‌కు చెందిన చెల్లింపుల విభాగంలో చేరతారని అమెజాన్ పేమెంట్స్ ఇండియా డెరైక్టర్ శ్రీనివాస్ రావు చెప్పారు. వీరితో కలసి తమ చెల్లింపుల విభాగం ఉద్యోగులు మరింత వినూత్నమైన చెల్లింపుల సొల్యూషన్లను అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. వచ్చే నెల చివరికల్లా ఈ డీల్ పూర్తవుతుందని తెలిపారు.