గ్రిడ్కు 130 మెగావాట్లు: ఫస్ట్ సోలార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సౌర విద్యుత్ రంగంలో ఉన్న ఫస్ట్ సోలార్ 130 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నుంచి 80 మెగావాట్లు, తెలంగాణ ప్రాజెక్టు నుంచి 50 మెగావాట్లు ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 260 మెగావాట్లని కంపెనీ ఇండియా హెడ్ ఘోష్ చెప్పారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. కంపెనీ ఇప్పటికే మరో ప్రాజెక్టు నుంచి 20 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించింది.