grid
-
నైజీరియాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
అబూజా: ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో గురువారం గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో దేశమంతటా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్ ఉత్పత్తి సున్నా మెగావాట్లుగా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. నైజీరియాలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడడం మామూలే. 2022లో ఏకంగా నాలుగు సార్లు గ్రిడ్ కుప్పకూలింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రెండు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అనుసంధానించే లైన్ అగ్నిప్రమాదానికి గురైందని, అందుకే గ్రిడ్ విఫలమైందని నైజీరియా విద్యుత్ శాఖ మంత్రి అడెబయో అడెలాబూ చెప్పారు. -
కరెంటు కట్.. పాకిస్తాన్లో స్తంభించిన విద్యుత్ సరఫరా..
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పలు నగరాల్లో సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి కరెంటు సరఫరా ఆగిపోయింది. పాకిస్తాన్ మీడియా సంస్ధలు ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత ఆ దేశ విద్యుత్ శాఖ కూడా ట్వీట్ చేసింది. నేషనల్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పడిపోవడం వల్లే విద్యుత్ సరఫరా స్తంభించినట్లు అధికారులు తెలిపారు. దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని 117 గ్రిడ్ స్టేషన్లు సహా కరాచీ, పేషావర్, బలూచిస్తాన్‌లోని 22 జిల్లాలు విద్యత్ సరఫరా అంతరాయం కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2021లో కూడా పాకిస్తాన్లో ఇలాగే జరిగింది. సింధ్ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రంలో సాంకేతిక తప్పిదం కారణంగా ఫ్రీక్వెన్సీ 50 నుంచి సున్నాకు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కరోజు తర్వాత దీన్ని పునరుద్ధరించారు. చదవండి: ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తే ప్రపంచ వినాశనమే.. రష్యా హెచ్చరిక -
ఆఫీస్ స్పేస్.. పక్కాప్లాన్
-
తెలంగాణ గ్రిడ్‌పై డ్రా‘గన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై చైనా నుంచి సైబర్ దాడులకు ప్రయత్నాలు జరుగు తున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) హెచ్చరించింది. చైనాకు చెందిన ‘కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లు’.. తెలంగాణ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ)తోపాటు తెలంగాణ ట్రాన్స్‌కో కంప్యూటర్ సిస్టంలతో ‘కమ్యూనికేట్’ కావడానికి ప్రయత్నిస్తున్నాయని, విద్యుత్ వ్యవస్థ భద్రత దృష్ట్యా సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. భారతదేశ సైబర్ భద్రత అవసరాల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2004లో ‘సీఈఆర్టీ–ఇన్’ను ఏర్పాటు చేసింది. సీఈఆర్టీ–ఇన్ తాజా హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ట్రాన్స్కోఅప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకుంది. సీఈఆర్టీ–ఇన్ గుర్తించి పంపిన ‘చైనీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ల ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) అడ్రస్‌లను ట్రాన్స్‌కో బ్లాక్ చేసింది. దీంతో చైనీస్ సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న ఈ సర్వర్లు.. ట్రాన్స్‌కో, ఎస్ఎల్డీసీకు చెందిన కంప్యూటర్ సిస్టంలతో కమ్యూనికేట్ కావడానికి దారులు మూసేసినట్టు అయింది. - హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో ఉన్న లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచి రిమోట్ ఆపరేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సబ్ స్టేషన్లలోని సర్క్యూట్ బ్రేకర్లను నియంత్రించే వ్యవస్థ పనిచేయకుండా తాత్కాలికంగా డిజేబుల్ చేసింది. దీంతో హాకర్లు రిమోట్ ఆపరేషన్ ద్వారా గ్రిడ్‌ను నియంత్రణలోకి తీసుకోవడానికి, కుప్పకూల్చడానికి అవకాశం లేకుండా పోయింది. - దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) వెబ్‌సైట్‌కు సంబంధించి లాగిన్ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను మార్చివేసింది. - గ్రిడ్ భద్రతను కట్టుదిట్టం చేయడానికి .. సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్ (స్కాడా) కంట్రోల్ సెంటర్ పరిధి నుంచి అనుమాస్పద పరికరాలను దూరంగా తరలించి ఐసోలేట్ చేశారు. ప్రధానంగా చైనా నుంచి కొనుగోలు చేసిన పరికరాలను గుర్తించి స్కాడా పరిధి నుంచి దూరంగా తరలించారు. రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ప్రమాదం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. నష్టమేంటి! సైబర్ నేరగాళ్లు మన విద్యుత్ సంస్థల కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడితే... మొత్తం సరఫరా వ్యవస్థను వారు నియంత్రించగలుగుతారు. గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది. గ్రిడ్ కుప్పకూలితే విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాష్ట్రం అంధకారం అవుతుంది. కొన్ని గంటల పాటు కరెంటు ఉండదు. పరిస్థితి తీవ్రతను బట్టి ఈ సమయం పెరుగుతుంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. థర్మల్ పవర్స్టేషన్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోతుంది. పునరుద్ధరించాలంటే ఒకట్రెండు రోజుల సమయం పడుతుంది. ఒకేసారి అన్ని యూనిట్లలో ఉత్పత్తిని పునరుద్ధరించడం సాధ్యం కాదు. క్రమేపీ ఒక్కో యూనిట్‌ను స్టార్ట్ చేస్తూ... పూర్తి సామర్థ్యానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లు అంటే? హాకింగ్, సైబర్ దాడుల కోసం సైబర్ నేరస్థులు వినియోగించే కంప్యూటర్లను ‘కమాండ్ అండ్ కంట్రోల్ (సీ అండ్ సీ) సర్వర్లు’అంటారు. ఈ సర్వర్ల నుంచి దాడులు చేయాల్సిన కంప్యూటర్లకు కమాండ్స్ (సాంకేతిక ఆదేశాలు) పంపించి డేటాను చోరీ చేయడం లేదా మొత్తం కంప్యూటర్ నెట్‌వర్క్‌ను తమ నియంత్రణలోకి తీసుకోవడం చేస్తుంటారు. సిస్టమ్స్‌లో మాల్వేర్ చొప్పించి ఈ దాడులకు పాల్పడుతారు. ఈ ప్రక్రియ అంతటికీ కమ్యూనికేట్ కావడమే కీలకం. ఒకసారి గనక సైబర్ నేరగాళ్లు మన వ్యవస్థలో ఒక సిస్టంతో సంబంధాలు నెలకొల్పుకోగలిగితే చాలు. ఆపై మొత్తం నెట్‌వర్క్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగలుగుతారు. ముంబై తర్వాత టార్గెట్ హైదరాబాద్? చైనా నుంచి సైబర్ దాడుల ఫలితంగానే గతేడాది అక్టోబర్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలి ముంబై నగరం అంధకారమైందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సోమవారం సంచలన కథనం రాసింది. గాల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత భారత దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేయాలన్న ఉద్దేశంతో చైనా ఈ సైబర్ దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేసింది. మరుసటి రోజే సీఈఆర్టీ–ఇన్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చైనా నుంచి సైబర్ దాడులకు పొంచి ఉన్న ముప్పుపై హెచ్చరికలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని ఎన్నో వ్యూహాత్మక సంస్థలకు నిలయమైన హైదరాబాద్ నగరాన్ని సైతం లక్ష్యంగా చేసుకుని చైనా సైబర్ దాడులకు ప్రయత్నాలు చేసినట్టు తాజా హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి. అంతటా ఆటోమేషన్.. విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ నుంచి విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) నిర్వహణ వరకు ప్రస్తుతం అంతటా ఆటోమేషన్ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లతో నడిచే కంప్యూటర్/ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో మన అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుంటారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ముందే మాల్వేర్/వైరస్ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి, సరఫరా వ్యవస్థలను సైబర్ నేరస్థులు హైజాక్ చేసి గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది ముంబైలో గ్రిడ్ కూలిపోవడం వెనక ఇదే కారణమని చర్చ జరుగుతోంది. గతేడాది కేంద్రం హెచ్చరికలు విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రోజన్స్ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయని గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వ్యూహాత్మకమైన విద్యుత్ రంగాన్ని పరిరక్షించడానికి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. చైనా నుంచే అత్యధిక దిగుమతులు చైనా నుంచి భారత్‌కు దిగుమతుల్లో విద్యుత్ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్ఫార్మర్ల నుంచి స్మార్ట్ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది. -
‘గ్రిడ్’ గడబిడ!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) గ్రోత్ కారిడార్ ముఖచిత్రాన్ని మార్చే గ్రిడ్ రోడ్ల పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. 2008లో మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూరా ఇరువైపులా దాదాపు 718 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించినా ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. సర్వీస్ రోడ్డుతో పాటు ఇంటర్‌ఛేంజ్‌లకు అనుసంధానం చేసే ఈ రహదారుల విషయంలో పదకొండేళ్ల నుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో ఇక గ్రిడ్ రోడ్ల పని కంచికి చేరినట్టేనన్న అనుమానాలు ఓఆర్ఆర్ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. 2008లో అంచనా వేసిన గ్రిడ్ రోడ్ల పనులకు ఇప్పడూ మొదలుపెడితే అయ్యే పనులు తడిసి మోపెడవడం ఖాయమన్న భావనతో ఉన్న హెచ్ఎండీఏ అధికారులు వందల కోట్లతో రహదారులు నిర్మించడంపై దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓఆర్ఆర్ కిలోమీటర్ చుట్టూ పక్కల మల్టీపర్పస్ జోన్ కింద ఆవాసాలు కట్టుకోవచ్చని ప్రకటించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో గ్రిడ్ రోడ్ల అభివృద్ధి హెచ్ఎండీఏనే చూసుకుంటుందని అప్పటి అధికారులు 718 కిలోమీటర్ల మేర రహదారులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలో 2008 ఆగస్టు తొమ్మిదిన జీవో నంబర్ 470ను విడుదల చేసి గ్రిడ్ రోడ్ల నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు మోక్షం కలగలేదు. గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో ఇటు ఐటీ పెట్టుబడులు ఊపందుకోవడంతో పాటు రియల్ ఎస్టేట్ మరింత జోరందుకుంటుందనుకుంటే..ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. రెండు లేన్ల గ్రిడ్ రోడ్డు కిలోమీటర్‌కు రూ.8 కోట్లవుతాయని హెచ్ఎండీఏ అధికారులు చెబుతుండటంతో మొత్తం 5,744 కోట్లు అవసరం కానున్నాయి. అయితే ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనతో గ్రిడ్ రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మినీ పట్టణాలు ఇక లేనట్టేనా... 2008లో మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూరా ఇరువైపులా దాదాపు 718 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు.. ఇందుకోసం దాదాపు లక్ష ఎకరాలు అవసరముంటుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఇలా దాదాపు 30 వేల ఎకరాలు పోనుంది. దాదాపు పది వేల ఎకరాలు ప్లాటింగ్ చేసిన భూములున్నాయి. వీటిని కూడా ఏం చేసేందుకు వీలులేదు. మిగిలుతున్నది 60 వేల ఎకరాలే. ఈ లెక్కన చూసుకున్న ఈ 60 వేల ఎకరాల్లో గ్రిడ్ రోడ్లు అభివృద్ధి చేస్తే నగర శివారు ప్రాంతాలు మినీ పట్టణాలుగా ప్రగతివైపు అడుగులు పడటం ఖాయం. కానీ భూసేకరణ కష్టమని, వేల కోట్ల ఖర్చవుతుందని ఆవైపే ఎవరూ చూడటం లేదు. అయితే ఉప్పల్ భగాయత్ రైతుల నుంచి భూమి సేకరించి అభివృద్ధి చేసి ఇచ్చిన మాదిరిగానే ల్యాండ్ పూలింగ్ చేస్తే బాగుంటుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏ పురోగతి లేదు. ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేసే రేడియల్ రోడ్ల అభివృద్ధి కూడా అటకెక్కింది. ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యంతో రేడియల్ రోడ్ల పనుల్లో ఆశించినంత వేగిరం లేదనే అభిప్రాయం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది. కొత్త అభివృద్ధికి అవకాశం... ఓఆర్ఆర్ చుట్టూరా ఉన్న ప్రాంతాలైన మేడ్చల్‌లో హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ, పటాన్ చెరులో ఆటో పార్క్‌లు, పౌల్ట్రీ, వెజిటబుల్ మార్కెట్ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ, ఘట్కేసర్లో ఐటీ అండ్ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, కోకాపేటలో ఐటీ, స్పోర్ట్స్, ప్రభుత్వ సంస్థల పరిశ్రమలు, బొంగుళూరులో ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, పెద్ద అంబర్‌పేటలో మీడియా, ఆటోమొబైల్ అండ్ హోల్‌సేల్ ఇండస్ట్రీ, గుండ్ల పోచారంలో ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ తీసుకొస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ల అభివృద్ధితోనే ఇది సుసాధ్యమవుతుందని, పెట్టబుడులు సులభతరంగా వస్తాయని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. గ్రోత్ కారిడార్ అభివృద్ధితో నగర శివారు ప్రాంతాల ముఖచిత్రం మారుతుందని, భూముల విలువ పెరగడంతో పాటు ఐటీ రంగం అభివృద్ధికి ఊతమిస్తోందనే వాదన వారిలో వినబడుతోంది. దాదాపు 32 మండలాలను అనుసంధానం చేయనున్న ఈ గ్రిడ్ రోడ్ల ద్వారా రీజినల్ రింగ్ రోడ్డు కూడా డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. అయితే దీనికి రూ.5,744 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం దృష్టిసారిస్తే మంచిది... నగర శివారు ప్రాంతాలను అనుకొని ఉన్న ఓఆర్ఆర్కు వివిధ మార్గాల నుంచి సరైన కనెక్టివిటీ లేదు. ఇప్పటివరకు కేవలం సర్వీసు రోడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైవేల నుంచి ఓఆర్ఆర్కు సరైన అనుసంధానం లేదు. అందుకే అభివృద్ధి వైపు పరుగులు పడటం లేదు. ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యం. మల్టీపర్పస్ జోన్ కూడా ఉంది. మౌలికవసతులను మెరుగుపడేందుకు అస్కారం ఉంటుంది. ఇప్పటికైనా గ్రోత్ రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తే శివారుల్లో మినీ ప్రాంతాలు వందల్లో వెలిసే అవకాశముంటుంది. వివిధ రంగాల్లో పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెండుగా రానున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవడం కూడా ఖాయంగా కనబడుతోందని ఓఆర్ఆర్ ప్రాంతవాసులు అంటున్నారు. గుర్తించిన గ్రిడ్ రోడ్డు మార్గాలు ఇవే... ♦ ఇబ్రహీం పట్నం–హయత్‌నగర్ ♦ మహేశ్వరం–శంషాబాద్–ఇబ్రహీంపట్నం ♦ రాజేంద్రనగర్–శంషాబాద్–మొయినాబాద్–శంకర్పల్లి ♦ రామచంద్రపురం–శంకర్పల్లి–పటాన్చెరు ♦ రాజేంద్రనగర్–శేరిలింగంపల్లి–రామచంద్రపురం–జిన్నారం ♦ మేడ్చల్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్ ప్రాంతాలను పటాన్చెరు అనుసంధానం చేయనుంది. -
ఫైబర్‌గ్రిడ్ ఎక్కడ?
- జనవరి 5న రామచంద్రపురం సభలో ప్రకటించిన సీఎం - 45 రోజుల్లో ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు - 100 రోజులు దాటినా అతీగతీ లేదు - ఐటీ మంత్రిగా ఆయన తనయుడు లోకేష్ నేడు రాక - ఇప్పటికైనా ఏర్పాటుచేస్తారా అని ఎదురు చూస్తున్న ప్రజలు సాక్షి, రాజమహేంద్రవరం : ‘‘రామచంద్రపురం పట్టణంలో 45 రోజుల్లో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం. పట్టణంలో ఉన్న 12,500 ఇళ్లకు కనెక్షన్ ఇస్తాం. రూ.149కే టీవీ, ఇంటర్నెట్ వినియోగించకోవచ్చు. 45 రోజుల తర్వాత నేను మీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతాను’’ - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 5న రామచంద్రపురంలో జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో చెప్పిన మాటలు. ఇది విన్న రామచంద్రపురం ప్రజలు సంతోషంలో ఓలలాడారు. ఇక ప్రతి నెలా రూ.149కే కేబుల్ కనెక్షన్ వస్తుందని, కంప్యూటర్ ఉన్నవారికి ఇంటర్నెట్ బిల్లు కట్టనవసరంలేదని భావించారు. యువత, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చని ఆనందపడ్డారు. ముఖ్యమంత్రి ఈ మాటలు చెప్పి 100 రోజులు దాటింది. ఇప్పటివరకూ ఆ హామీకి అతీగతీ లేదు. 45 రోజుల్లోనే ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటుపై అధికారులకు ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. 45 రోజులు పూర్తవుతున్నా ఎటువంటి చర్యలూ కనిపించకపోవడంతో ఎన్నికల హామీల్లాగే దీనిని కూడా చంద్రబాబు గాల్లో కలిపేశారని అనుకున్నారు. తాజాగా చేసిన మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌కు ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చారు. ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు ఐటీ పరిధిలో ఉంటుంది. అప్పటివరకూ ఈ శాఖ పల్లె రఘునాథరెడ్డి వద్ద ఉండడంతో ఐటీ రంగంలో పరుగు తీయలేకపోయామని భావించిన ముఖ్యమంత్రి ఆ శాఖను తన తనయుడికి కట్టబెట్టారు. లోకేష్ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మన జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి చంద్రబాబు తమకు ఇచ్చిన హామీ నెరవేర్చడంపై లోకేష్ దృష్టి పెడతారా? లేదా? అని రామచంద్రపురం ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
గ్రిడ్‌కు 130 మెగావాట్లు: ఫస్ట్ సోలార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సౌర విద్యుత్ రంగంలో ఉన్న ఫస్ట్ సోలార్ 130 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నుంచి 80 మెగావాట్లు, తెలంగాణ ప్రాజెక్టు నుంచి 50 మెగావాట్లు ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 260 మెగావాట్లని కంపెనీ ఇండియా హెడ్ ఘోష్ చెప్పారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. కంపెనీ ఇప్పటికే మరో ప్రాజెక్టు నుంచి 20 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించింది. -
ఎకో గృహంతో ఎంతో మేలు...!
టిమ్ విల్కాక్స్, అతని భార్య మార్గరెట్ లు నిర్మించిన ఆ భవనం... ఇప్పుడో చిన్న పవర్ స్లేషన్ ను తలపిస్తోంది. వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ తో కూడిన, సూపర్ ఇన్సెలేటెడ్ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. కరెంటు, వాటర్ బిల్లుల ఖర్చును తగ్గించడమే కాక, పర్యావరణ అనుకూలమైన ఆ భవనం.. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచిపెడుతోంది. రిటైర్డ్ అకౌంటెంట్ అయిన 66 ఏళ్ళ విల్కాక్స్... స్వీడన్ లోని హౌస్ బిల్డర్ల ద్వారా తెలుసుకున్న ఆలోచనను తన ఇంటికి అమలు చేశారు. అరవైశాతం వాటర్ బిల్ తగ్గించే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ తో పాటు... సూపర్ ఇన్సులేటెడ్ హౌస్ నిర్మాణానికి విల్కాక్స్ దంపతులు సుమారు 500,000 యూరోలు ఖర్చు చేశారు. ఇంటి నిర్మాణంలో వెంటిలేషన్ కూడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో.. చెడు గాలిని బయటకు పంపి, శుభ్రమైన గాలిని లోపలకు తెచ్చే అవకాశం కూడ ఉంది. శీతాకాలంలో హీటర్లతో వేలకు వేలు కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా నిర్మించిన ఆ భవనం... నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం కూడ పాలుపంచుకుంది. ఎకో గృహ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 1,500 యూరోలను నేషనల్ గ్రిడ్ అందించింది. ఆ భార్యాభర్తలు నిర్మించిన పర్యావరణ అనుకూల గృహం..ఇప్పుడు ఆ ఇంటికంతకీ విద్యుత్తును అందించే ఓ చిన్న పవర్ స్టేషన్ గా మారింది. ఆ ఇంట్లో రెండు రకాల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. సోలార్ పవర్ తో పాటు, ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ళద్వారా వేడినీళ్ళతో విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. గతేడాది మొత్తం పన్నెండు నెలల్లో ఉత్పత్తిచేసిన 706.40 యూరోల విద్యుత్తునుంచి ఈ దంపతులు 292.87 యూరోల గ్యాస్, 413.53 యూరోల విద్యుత్తు వినియోగించుకున్నారు. మిగిలిన విద్యుత్తును సప్లై చేయడం ద్వారా నేషనల్ గ్రిడ్ అధికారులనుంచి 147 యూరోలను కూడ అందుకోగలిగారు. అంతేకాదు.. వీరికి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా పోయింది. ఈ ఎకో హౌస్ లోని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా ఐదు వేల లీటర్ల ట్యాంక్ నిండుతుంటుంది. ఈ నీటిని వీరు టాయిలెట్లలో ఫ్లషింగ్ కు వాడుతున్నారు. దీంతో వాటర్ బిల్లులు కూడ 60 శాతం తగ్గిపోయాయి. సూపర్ ఇన్సులేట్ గోడలు, పైకప్పుతోపాటు, పది అంగుళాల మందపాటి పాలీస్టైరిన్ ప్యానెళ్ళు ఉపయోగించి ఈ పర్యావరణ గృహాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో వెంటిలేషన్ ద్వారా పాతగాలి బయటకు పంపి, కొత్త.. శుభ్రమైన గాలిని లోపలికి తెచ్చే ఓ ప్రసరణ వ్యవస్థ కూడ ఉంది. ఇకపై గృహ నిర్మాణాలు ఇదే పద్ధతిలో కొనసాగితే.. కొత్తగా విద్యుత్ కేంద్రాల స్థాపనే అవసరం ఉండదని విల్కాక్స్ అంటున్నారు. ట్రాంక్విల్లిటీలుగా పిలిచే ఈ గృహాల నిర్మాణానికి రెండేళ్ళ సమయం పడుతుంది. ఈ నిర్మాణం పూర్తయ్యే సరికి 520.000 యూరోలు ఖర్చయినా... ఇప్పుడు ఈ గృహం ఖరీదు 800.000 యూరోలు విలువ చేస్తోంది. ఏ రకంగా చూసినా ఈ ఎకో హోమ్ వల్ల లాభమే ఉంటుందని విల్కాక్స్ అంటున్నారు. అంతేకాక డబ్బు కూడ పొదుపు అవుతుందని చెప్తున్నారు.