కమిషన్ పెంచేసిన ఫ్లిప్ కార్ట్ | Flipkart joins Amazon in increasing seller fees | Sakshi
Sakshi News home page

కమిషన్ పెంచేసిన ఫ్లిప్ కార్ట్

Published Mon, Jun 6 2016 11:35 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Flipkart joins Amazon in increasing seller fees

బెంగళూరు : వర్తకులకు వసూళ్ల కమిషన్ పెంచడంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బాటలోనే దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నడుస్తోంది. అమెజాన్ తన వ్యాపారులకు వసూళ్ల కమిషన్ పెంచిన అనంతరం, బెంగళూరుకు చెందిన ఫ్లిప్ కార్ట్ సైతం తన అమ్మకందారులకు కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. మొబైల్ వంటి వివిధ కేటగిరీల్లో అమ్మకందారులకు కమిషన్ ను 5 నుంచి 6శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ఈ కొత్త గైడ్ లైన్లు జూన్ 20 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. రెవెన్యూలను పెంచుకోవడానికి, నష్టాలను తగ్గించడానికి ఫ్లిప్ కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.

అదేవిధంగా వెబ్ సైట్ లో ఎక్కువ అమ్ముడు పోయే ఉత్పత్తులను, కస్టమర్లకు నచ్చకపోతే వెనక్కిపంపే రోజులను కూడా ఫ్లిప్ కార్ట్ తగ్గించింది. 30 రోజులుగా ఉన్న ఈ రోజులను 10 రోజులకు కుదించింది. దీంతో కస్టమర్లు వస్తువులు నచ్చకపోతే 10రోజుల్లో వెనక్కి పంపించాల్సి ఉంటుంది.  



తన ప్లాట్ ఫామ్ లో వ్యాపారుల కోసం మరో రెండు కొత్త ఫీజు విధానాలను ఫ్లిప్ కార్ట్ ఆవిష్కరించనుంది. ఒకటి ఫిక్స్ డ్ కాంపోనెంట్ విధానం, మరొకటి ఉత్పత్తి అమ్మినందుకు 2.5శాతం పేమెంట్ కలెక్షన్ ఫీజును అమ్మకందారులకు ఫ్లిప్ కార్ట్ చార్జ్ చేయనుంది. అదనపు కమిషన్ కాకుండా, ఒకవేళ ఉత్పత్తులను వెనక్కి పంపితే సరుకు రవాణా ఫీజు కూడా  అమ్మకందారులే భరించాల్సి ఉంటుందని ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ తెలిపారు. గత నెల ముందు అమెజాన్ 9శాతం కమిషన్లను పెంచగా... స్నాప్ డీల్ మాత్రం పడిపోతున్న అమ్మకాలను పెంచడానికి అమ్మకందారులకు కమిషన్ లో కోత విధించింది.

అయితే ముందు నుంచి ఫ్లిప్ కార్ట్ అమ్మకందారులపై ఎలాంటి పేమెంట్ కలెక్షన్ ఫీజును చార్జ్ చేయలేదు. ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టిన ఈ కొత్త చెల్లింపుల రుసుము(పేమెంట్ కలెక్షన్ ఫీజు), పోటీసంస్థలు అమెజాన్, స్నాప్ డీల్ లు వసూలు చేస్తున్న దానికంటే కొంతమేర అధికంగా ఉన్నాయి. అమెజాన్, స్నాప్ డీల్ సంస్థలు పేమెంట్ కలెక్షన్ ఫీజు కింద అమ్మకందారుల నుంచి 2 నుంచి 2.3శాతం వసూలు చేస్తున్నాయి. 90 వేల అమ్మకందారులు, 750లక్షల రిజిస్ట్రర్ యూజర్లను ఫ్లిప్ కార్ట్ కలిగిఉంది. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ విధానాలను అమ్మకందారులు ముందే ఊహించినవని, ఆన్ లైన్ బిజినెస్ లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవడం కోసం వీటిని తీసుకొస్తున్నామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement