ఫ్లిప్ కార్ట్ మెగా యాప్: అన్నింటికీ ఇది ఒక్కటే
ఫ్లిప్ కార్ట్ మెగా యాప్: అన్నింటికీ ఇది ఒక్కటే
Published Wed, Jun 14 2017 9:07 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్తోన్న ఫ్లిప్ కార్ట్, మరో సరికొత్త సర్వీసులను ప్రారంభించబోతుంది. అన్నీ తానై అయ్యేందుకు ' ఎవ్రీథింగ్ యాప్' పేరుతో ఓ మెగా యాప్ ను లాంచ్ చేయబోతుంది. ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, టూర్స్ ప్లానింగ్ ఇంకా నిత్యవాడుకలో అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యాప్ లాంచ్ చేయడం కోసం ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ సన్నాహాలు ప్రారంభించేసింది. ఫుడ్, క్యాబ్, ట్రావెల్ అగ్రిగేటర్లను భాగస్వాములుగా చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎలాగైనా ఈ ఏడాది చివరి కల్లా దీన్ని తీసుకురావాలని కంపెనీ ప్లాన్స్ వేస్తోంది.
ఈ మెగా యాప్ తో వినియోగదారుల విధేయతను మరింత పెంచుకోనుంది. దీన్ని ఫ్లిప్ కార్ట్ యాప్ డిజైన్, ఇంజనీరింగ్ టీమ్ ఎగ్జిక్యూట్ చేస్తోంది. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్ క్రిష్ణమూర్తి ప్రారంభించిన ఈ వ్యూహం, కంపెనీ ప్రకటనల వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్తోందని ఫ్లిప్ కార్ట్ భావిస్తోంది. విచాట్ మోడల్ ను తాము అనుసరిస్తున్నామని, ఈ యాప్ ను వాడుకుంటూ క్యాబ్, ఫుడ్ ను ఆర్డర్ చేసుకోవడంతో పాటు, ట్రావెల్ ను ప్లాన్ చేసుకోవచ్చని మోనిటైజేషన్ సీనియర్ డైరెక్టర్ ప్రకాశ్ సికారియా చెప్పారు. అచ్చం గూగుల్ ఇటీవల లాంచ్ చేసిన ఆరియో మాదిరి వినియోగదారుల సేవలనే ఫ్లిప్ కార్ట్ వాల్యు యాడెడ్ సర్వీసులు అందజేయనున్నాయి. రోజువారీ వస్తువుల కోసం, ఎలాంటి భాగస్వామ్యం లేకుండా ఫ్లిప్ కార్ట్ తన సొంత కార్యకలాపాలనే కలిగి ఉండనుంది.
కంపెనీ త్వరలోనే గ్రోసరీ, ఫాస్ట్-మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ను ఆఫర్ చేయనుంది. ఈ వ్యూహం ఫలించడం కోసం ఈ యాప్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న స్నాప్ డీల్ కూడా గతేడాది ఇదే మాదిరి ప్లాన్స్ వేసిందని తెలిసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జుమోటో, టాక్సీ అగ్రిగేటర్ ఉబర్, ట్రావెల్ స్టార్టప్ క్లియర్ ట్రిప్ వంటి వాటితో భాగస్వామ్యానికి ప్రయత్నించింది. ప్రస్తుతం డిజిటల్ వ్యాలెట్ సేవల్లో అగ్రగామిగా ఉన్న పేటీఎం కూడా ఇదేమాదిరి సర్వీసులు అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ కనుక ఈ మెగా యాప్ ను తీసుకొస్తే, పేటీఎంకు ఇది గట్టి పోటీని ఇవ్వనుంది.
Advertisement
Advertisement