ఐడియాచక్కిలో రతన్ టాటా పెట్టుబడులు | Food tech start-up Idea Chakki raises funds from Ratan Tata | Sakshi
Sakshi News home page

ఐడియాచక్కిలో రతన్ టాటా పెట్టుబడులు

Published Tue, Sep 13 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

ఐడియాచక్కిలో రతన్ టాటా పెట్టుబడులు

ఐడియాచక్కిలో రతన్ టాటా పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఫుడ్ టెక్ స్టార్టప్ ‘ఐడియాచక్కి’లో దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు. అయితే ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారో తెలియాల్సి ఉంది. ఐడియాచక్కి సంస్థ రెస్టారెంట్లకు డిజిటల్ వీడియో మెనూ సేవలను అందిస్తుంది. రతన్ టాటా పెట్టుబడులను వ్యాపార కార్యకలాపాల విస్తరణ కు, టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగిస్తామని ఐడియాచక్కి తెలిపింది.

కాగా రతన్ టాటా గత కొంతకాలంగా పలు స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌చేస్తూ వస్తున్నారు. వీటిల్లో స్నాప్‌డీల్, ల్యాడర్, బ్లూస్టోన్, కార్‌దేఖో, సబ్సే టెక్నాలజీస్, షావొమీ, ఓలా, డాగ్‌స్పాట్.ఇన్, క్యాష్‌కరో, టీబాక్స్ వంటి పలు సంస్థలు ఉన్నాయి. ఇక ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఐడియాచక్కిని ఎన్‌డీటీవీకి చెందిన ముగ్గురు మాజీ ఎగ్జికూటివ్స్ స్థాపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement