ఈ-కామర్స్ సంస్థ ఫస్ట్ క్రైలో రతన్ టాటా పెట్టుబడులు | Ratan Tata Invests in E-Commerce Baby Care Platform FirstCry | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్ సంస్థ ఫస్ట్ క్రైలో రతన్ టాటా పెట్టుబడులు

Published Fri, Jan 22 2016 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

ఈ-కామర్స్ సంస్థ ఫస్ట్ క్రైలో రతన్ టాటా పెట్టుబడులు

ఈ-కామర్స్ సంస్థ ఫస్ట్ క్రైలో రతన్ టాటా పెట్టుబడులు

న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులను కొనసాగిస్తూ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా ఈకామర్స్ సంస్థ ఫస్ట్‌క్రైలో ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్‌క్రైడాట్‌కామ్ బ్రాండ్ మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో వ్యక్తిగత హోదాలో ఆయన పెట్టుబడులు పెట్టారు. అయితే, ఎంత ఇన్వెస్ట్ చేసినదీ వెల్లడి కాలేదు. తల్లులు, పిల్లలకు ఉపయోగపడే ఉత్పత్తులను ఫస్ట్‌క్రై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమంలో విక్రయిస్తోంది. 2010లో కార్యకలాపాలు ప్రారంభించిన ఫస్ట్‌క్రైకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 నగరాల్లో 150 ఫ్రాంచైజీలు ఉన్నాయి. దీనికోసం బ్రెయిన్‌బీస్ ఇప్పటిదాకా 69 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. రతన్ టాటా వంటి దిగ్గజం ఇన్వెస్ట్ చేయడం తమ సంస్థకు మరింత ప్రయోజనం చేకూర్చగలదని బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ వ్యవస్థాపక సీఈవో సుపమ్ మహేశ్వరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement