
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) కోసం రంగం సిద్ధం చేస్తోంది. ఈ సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌కు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించే సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న సంస్థలు వచ్చే నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని దీపమ్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్) పేర్కొంది.
సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా మొదటి విడత రూ.3,000 కోట్లు, రెండోసారి రూ.6,000 కోట్లు, మూడో విడత రూ.2,500 కోట్లు చొప్పున మొత్తం రూ.11,500 కోట్ల మేర పెట్టుబడులను సమీకరించింది. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లాగా పనిచేస్తుంది. ఈ ఈటీఎఫ్‌లో పది ప్రభుత్వ రంగ షేర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment