న్యూఢిల్లీ: ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 73 శాతం క్షీణించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.440 కోట్లుగా ఉన్న నికర లాభం(స్టాండోలోన్) గత క్యూ4లో రూ.118 కోట్లకు తగ్గిందని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తెలిపింది. అధిక ఇంధన వ్యయాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.5,142 కోట్ల నుంచి రూ.6,057 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇంధన వ్యయాలు రూ.1,751 కోట్ల నుంచి రూ.2,338 కోట్లకు ఎగిశాయని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,657 కోట్లుగా ఉన్న మొత్తం సమగ్ర ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,243 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
అలాగే మొత్తం ఆదాయం రూ.19,370 కోట్ల నుంచి రూ.23,968 కోట్లకు పెరిగిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో నికర లాభం సాధించామని ఇండిగో వ్యవస్థాపకుల్లో ఒకరు, తాత్కాలిక సీఈఓ రాహుల్ భాటియా చెప్పారు. వృద్ధి ప్రణాళికల అమలును కొనసాగిస్తామని తెలిపారు. కాగా, మార్కెట్ ముగిసిన తర్వాత ఈ ఫలితాలు వెలువడ్డాయి. విమానయాన ఇంధనం ధరలు పెరగడం, ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్ పదవి నుంచి అదిత్య ఘోష్ అర్థాంతరంగా వైదొలగడం, ఆ తర్వాత కంపెనీ షేర్ ధర పతనంపై సెబీ దృష్టి సారించడం వంటి కారణాలతో బీఎస్‌ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ 3.6 శాతం నష్టంతో రూ.1,348 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,977 కోట్లు తగ్గి రూ.51,828 కోట్లకు పరిమితమైంది.
ఇండిగోకు ఇంధన వ్యయాల సెగ
Published Thu, May 3 2018 1:06 AM | Last Updated on Thu, May 3 2018 1:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment