గాయత్రి ప్రాజెక్ట్స్ లాభం రూ. 28 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గాయత్రి ప్రాజెక్ట్స్ నికర లాభం దాదాపు 75 శాతం వృద్ధితో సుమారు రూ. 16 కోట్ల నుంచి రూ. 28 కోట్లకు (స్టాండెలోన్) పెరిగింది. ఆదాయం రూ. 560 కోట్ల నుంచి రూ. 668 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,601 కోట్ల నుంచి రూ. 1,812 కోట్లకు, లాభం రూ. 22 కోట్ల నుంచి రూ. 59 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను షేరు ఒక్కింటిపై రూ. 2 (20శాతం) డివిడెండును కంపెనీ ప్రకటించింది.