మార్కెట్లోకి జిల్లెట్ వీనస్ బ్రీజ్
చెన్నై:
రేజర్స్ ఉత్పత్తి రంగంలో రాణిస్తున్న జిల్లెట్ కొత్తగా మార్కెట్లోకి వీనస్ బ్రీజ్‌ను ప్రవేశపెట్టింది. నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటి కాజల్ అగర్వాల్ దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. పర్పుల్ డాట్‌కామ్ ప్రస్తుతం జిల్లెట్ విమెన్ రేజర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ రేజర్స్ ద్వారా మహిళలు అవాంచిత రోమాలను తొలగించుకునేందుకు వీలుకలుగుతున్నట్లు పర్పుల్ డాట్‌కామ్, కో–ఫౌండర్, సీఈఓ మనీష్ తనేజా తెలిపారు. ఈ రేజర్ ఐకానిక్ మాయిశ్చర్ జెల్ బార్స్‌తో, సెక్యూర్ గ్రిప్, ఒన్ స్ట్రోక్ షేవింగ్, హ్యాండ్లింగ్‌కు అనువుగా ఉన్నట్లు తెలిపారు. ఇవి చర్మానికి ఎటువంటి హాని కలిగించవని పేర్కొన్నారు. తమ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్టు తెలిపారు.