
ఫెడ్ రేటు పెరిగితే భారత్‌కు మంచిదే
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంచితే భారత్‌కు...
ముంబై: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంచితే భారత్‌కు సానుకూలమేనని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్ (బీఓఏ-ఎంఎల్) శుక్రవారం విడుదల చేసిన తాజా నివేదికలో తెలిపింది. ఫెడ్ నిర్ణయం ఆలస్యం అయిన కొద్దీ దేశంలోకి పెట్టుబడుల ప్రవాహంలో ప్రతిష్టంభన ఉంటుందని, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడతాయని కూడా నివేదిక విశ్లేషించింది. సెప్టెంబర్ 17 సమావేశం తరువాత అమెరికా ఫెడ్ వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) పెంచే అవకాశం ఉందని తెలిపింది.