బెస్ట్ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్
న్యూయార్క్: పనిచేయడానికి అనువుగా ఉండే ఉత్తమ బహుళజాతి కంపెనీల జాబితాలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అగ్రస్థానం దక్కించుకుంది. సాఫ్ట్వేర్ డెవలపర్ సాస్ ఇన్స్టిట్యూట్, నెట్వర్క్ స్టోరేజ్ ప్రొవైడర్ నెట్ఆప్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నాలుగు ర్యాంకులో ఉంది.
పనిచేయడానికి సకల సౌకర్యాలతో అద్భుతంగా అనిపించే 25 బహుళజాతి కంపెనీల జాబితాను ఓ హ్యూమన్ రీసోర్స్స్ కన్సల్టెన్సీ రూపొందించింది. వీటిలో భారతదేశానికి చెందిన ఒక్క కంపెనీ కూడా లేదు. ఈ 25 కంపెనీలు అమెరికా లేదా ఐరోపాకు చెందినవి కావడం విశేషం. టాప్టెన్లో 9 అమెరికా కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. ఆసియా కంపెనీలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. 45 దేశాలకు చెందిన 6 వేలకు పైగా కంపెనీల స్థితిగతులను పరిశీలించి ఈ జాబితా రూపొందించారు.