
5 సెజ్‌లకు అనుమతి
ప్రభుత్వం ఐదు కొత్త ప్రత్యేక ఆర్థిక మండలాలు(స్పెషల్ ఎకనామిక్ జోన్–సెజ్)ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఐదు కొత్త ప్రత్యేక ఆర్థిక మండలాలు(స్పెషల్ ఎకనామిక్ జోన్–సెజ్)ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన వాటిల్లో ఒరాకిల్ ఇండియా, ఎల్ అండ్‌టీ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్‌ల ప్రతిపాదనలు ఉన్నాయి. ఒరాకిల్ ఇండియా కంపెనీ కర్నాటకలో ఐటీ, ఐటీఈఎస్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నది. ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ కూడా రెండు ఐటీ, ఐటీఈఎస్ సెజ్‌లను ఇదే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నది. కర్నాటకలోనే ఐటీ జోన్ ఏర్పాటు చేస్తామన్న మోడర్న్ అసెట్ అండ్ మోడర్న్ అసెట్(ఫేజ్ టూ) ప్రతిపాదన కూడా ఆమోదం పొందింది.