హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 శాతం మూడవ మధ్యంతర డివిడెండు చెల్లించాలని గ్రాన్యూల్స్ బోర్డు నిర్ణయించింది. డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 71 శాతం అధికమై రూ.60 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.411 కోట్ల నుంచి రూ.637 కోట్లకు చేరింది. ఏప్రిల్–డిసెంబరులో రూ.1,690 కోట్ల టర్నోవరుపై రూ.172 కోట్ల నికరలాభం పొందింది. బీఎస్‌ఈలో మంగళవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.73 శాతం తగ్గి రూ.88.40 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment