
భారత్ కు మరో 2% వృద్ధి సాధన సత్తా: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలు, సానుకూల అంతర్జాతీయ పరిణామాలు మొదలైన అంశాల కారణంగా అదనంగా మరో 1-2 శాతం వృద్ధి రేటును సాధించగలిగే సత్తా భారత్‌కు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆర్థికాంశాలపరంగా భారత్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని 8వ వార్షిక ఎన్‌సీఎం ఉవన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.