హెచ్‌సీఎల్ టెక్ లాభం 1,920 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ లో నాలుగు అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ అయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. 2015, డిసెంబర్ 31తో ముగిసిన రెండో క్వార్టర్ లో రూ.1,920 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.1,915 కోట్లు)తో పోల్చితే 0.2 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ పేర్కొంది.
అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్ లో ఆదాయం(కన్సాలిడేటెడ్) 11.4 శాతం పెరిగి రూ.10,341 కోట్లుకు చేరుకుందని తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్ లో ఆదాయం(కన్సాలిడేటెడ్) రూ.9,283గా ఉంది. జూలై-సెప్టెండర్ క్వార్టర్ లో నికర లాభం రూ.1,726 కోట్లు, ఆదాయం రూ. 10,097 కోట్లుగా ప్రకటించింది. డాలర్లలో చూసుకుంటే హెచ్ సీఎల్ నికర లాభం 5.4 శాతం తగ్గి 290.8 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆదాయభివృద్ధి 5.1 శాతం పెరిగి 1.56 బలియన్ డాలర్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది.