ముంబై: ప్రైవేటు రంగంలో అగ్రగామి అయిన ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు’ మంగళవారం నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 25 లక్షల మొక్కలు నాటాలని, అలాగే, 2,500 తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని బ్యాంకు నిర్ణయించింది. సెంట్రల్ ముంబైలోని మున్సిపల్ పాఠశాలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్య పురి జామ మొక్కను నాటారు. ‘‘స్వచ్ఛమైన పర్యావరణానికి, స్మార్ట్ తరగతులకు ప్రత్యామ్నాయాలు ఏవీ లేవు. మన దేశం అంతర్జాతీయ శక్తిగా అవతరించేందుకు ఈ రెండు తప్పనిసరి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ విలువ రూ.6.64 లక్షల కోట్ల మార్క్ వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment