క్యూ3లో 4,581 ఉద్యోగాల కోత: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 4,581 మంది తగ్గారు. హైరింగ్ తక్కువగా ఉండడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం, సహజంగా ఉండే ఆట్రీషన్(ఉద్యోగుల వలస) వంటి కారణాల వల్ల తమ ఉద్యోగుల సంఖ్య తగ్గిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.
గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 95,002గా ఉన్న తమ మొత్తం ఉద్యోగుల సంఖ్య అదే ఏడాది డిసెంబర్ 31 నాటికి 90,421కు తగ్గిందని పేర్కొంది. అయితే 2015, డిసెంబర్‌తో పోల్చితే పెరిగిందని వివరించింది. 2015, డిసెంబర్‌లో ఉద్యోగుల సంఖ్య 84,619గా ఉందని పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో ప్రతి ఏడాది 16–22 శాతం రేంజ్‌లో ఆట్రీషన్ రేటు ఉంటుందని, తమ బ్యాంకు ఆట్రీషన్ రేటు 18–20 శాతం రేంజ్‌లో ఉందని వివరించింది.