హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం 23% అప్ | HDFC Bank Q4 net up 23%, NIM strong, asset quality stable | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం 23% అప్

Published Wed, Apr 23 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం 23% అప్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం 23% అప్

ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 2,327 కోట్ల నికర  లాభాన్ని సాధిం చింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన రూ. 1,890 కోట్లతో పోలిస్తే ఇది 23% అధికం. గత పదేళ్ల కాలంలో ఒక క్వార్టర్‌లో సాధించిన అతి తక్కువ వృద్ధి ఇదే కావడం గమనార్హం. బ్యాంకు గత 37 క్వార్టర్లుగా నికర లాభాల్లో 30%పైగా వృద్ధిని సాధిస్తూరాగా, మూడు క్వార్టర్లుగా 25%పైబడ్డ వృద్ధి నమోదైంది. ఇక ఇదే కాలానికి బ్యాంకు ఆదాయం కూడా దాదాపు 15% పుంజుకుని రూ. 12,790 కోట్లను తాకింది. 
 
 నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) సైతం 15%పైగా ఎగసి రూ. 4,953 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6.85 డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ బాటలో పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంకు 26% వృద్ధితో రూ. 8,478 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇక మొత్తం ఆదాయం రూ. 41,917 కోట్ల నుంచి రూ. 49,055 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కూడా బ్యాంకు నికర లాభం 27% జంప్‌చేసి రూ. 8,743 కోట్లను అధిగమించింది. 
 
 నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.4%గా నమోదయ్యాయి. తగ్గిన ప్రొవిజన్లు...
 బ్యాంకు ఆస్తులకు సంబంధించి పునర్వ్యవస్థీకరించిన రుణాలు లోన్‌బుక్‌లో 0.2%గా నమోదయ్యాయి. మొండిబకాయిలకు కేటాయింపులు(ప్రొవిజన్లు) రూ. 300 కోట్ల నుంచి రూ. 286 కోట్లకు తగ్గాయి. గత కొన్ని క్వార్టర్లుగా సమస్యలు తె చ్చిపెడుతున్న వాణిజ్య వాహనాలు, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్ కుదుటపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. క్యూ4లో అడ్వాన్సులు 21.8% పుంజుకోగా, డిపాజిట్లు 16.9% పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరు బీఎస్‌ఈలో 1.4% లాభపడి రూ. 726 వద్ద ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement