తెలుగులో హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ ట్రేడింగ్ యాప్
హైదరాబాద్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తన మొబైల్ ట్రేడింగ్ యాప్‌ను తెలుగుతో సహా 10 భాషల్లో ఆవిష్కరించింది. ఇంగ్లిష్, హిందీ, మరాఠి, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా భాషల్లో ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యాప్‌తో వినియోగదారులు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను కొనుగోలు చేయవచ్చని, విక్రయించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ ధీరజ్‌రెల్లి పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ సేవల్లో ఇదొక భాగమని తెలిపారు. దీంతో పాటు కొత్త తరం ట్రేడింగ్ కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను, దీనికి ఆన్‌లైన్ రిలేషన్‌షిప్ మేనేజర్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు.