సాక్షి, ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగి సిద్దార్థ్ సంఘ్వి (39) అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోవడం కలకలం రేపింది. కిడ్నాప్ కేసుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న సంఘ్వి ముంబై కమలా మిల్స్ ప్రాంతంలో తన కార్యాలయం నుంచి అనుమానాస్పద పరిస్థితుల్లో సెప్టెంబరు 5నుంచి కనిపించకుండాపోయారు. రాత్రి పది గంటలుదాటినా భర్త ఇంటికిరాకపోవడంతో సిద్ధార్ధ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సాయంత్రం 7.30 గంటలకు ఆఫీసు నుంచి బయలుదేరినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన మరునాడు పోలీసులు అనుమానాస్పద స్థితిలో ఆయన కారును కనుగొన్నారు. కోపార్ ఖైరనే ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న కారులో రక్తపు మరకలుండటం పలు అలుమానాలకు తావిచ్చింది. దీంతో సిద్ధార్ధ్ కిడ్నాప్ అయి వుంటారా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. కారును పరీక్షల నిమిత్తం పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment