
తగ్గిన హిందుస్తాన్ మీడియా లాభం
న్యూఢిల్లీ: హిందుస్తాన్ మీడియా వెంచర్స్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 7 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.47 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.44 కోట్లకు పడిపోయిందని హిందుస్తాన్ మీడియా వెంచర్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.240 కోట్ల నుంచి 4% క్షీణించి రూ.230 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్‌పర్సన్ శోభన భర్తియ తెలిపారు.