
హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎయిర్‌ఇండియా ప్రత్యేక విమానాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని విజయవాడకు రెండు రోజులు ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అక్టోబర్ 20, 21న రెండు రోజుల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. ఈ రెండు రోజులు ఏఐ 9534 సర్వీసు నెంబర్ గల విమానం హైదరాబాద్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి మూడు గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం మూడున్నరకు బయలు దేరి నాలుగన్నర గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.