
ఎయిరిండియా విమానానికి వర్షం ఎఫెక్ట్
విజయవాడ వెళ్లాల్సిన ప్రయాణికులు అక్కడ దిగకుండా మళ్లీ హైదరాబాద్ వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఎయిరిండియా ప్రయాణికులకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరిన ఎయిరిండియా విమానం తీరా అక్కడకు వెళ్లిన తర్వాత.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో భారీ వర్షం కురుస్తోంది.
దాంతో విమానం ల్యాండ్ అవడానికి అక్కడి అధికారులు అనుమతించలేదు. తత్ఫలితంగా విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికే తీసుకురావాల్సి వచ్చింది. విమానంలో వెళ్లిన ప్రయాణికులంతా మళ్లీ హైదరాబాద్లోనే దిగిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మూడు గంటలు ఆలస్యంగా ఆ విమానం తిరిగి విజయవాడకు వెళ్తుందని అధికారులు వెల్లడించారు.