
ముంబై: ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ కమర్షియల్ ప్రొపరీ్టస్‌లో మిగిలిన 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్ గ్రూప్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ మేరకు బ్లాక్‌స్టోన్‌తో ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీల్ విలువ రూ.4,420 కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి బ్లాక్‌స్టోన్ కంపెనీ నిరాకరించింది. గత ఏడాది మార్చిలో ఇండియాబుల్స్ కమర్షియల్ ప్రొపరీ్టస్‌లో 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్ కంపెనీ రూ.4,750 కోట్లకు కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment