ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభం 30 శాతం అప్
22 శాతం పెరిగిన ఆదాయం
ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర లాభం ఈ డిసెంబర్ క్వార్టర్‌లో 30 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో రూ.447 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు 30 శాతం వృద్ధితో రూ.581 కోట్లకు పెరిగిందని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,086 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.3,767 కోట్లకు ఎగసిందని పేర్కొంది.
స్థూల మొండిబకాయిలు 1.05 శాతం నుంచి 0.82 శాతానికి తగ్గాయని, అయితే నికర మొండిబకాయిలు 0.32 శాతం నుంచి 0.33 శాతానికి పెరిగాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ ధర బీఎస్‌ఈలో 2.6 శాతం క్షీణించి రూ.912 వద్ద ముగిసింది.