
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణంతోపాటు ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ ఊరట నిచ్చింది. ఈ రేటు ఫిబ్రవరిలో 2.48 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 ఫిబ్రవరితో పోల్చితే 2018 ఫిబ్రవరిలో టోకు వస్తువుల బాస్కెట్ ధర 2.48 శాతమే పెరిగిందన్నమాట. (2017లో టోకు ద్రవ్యోల్బణం 5.51 శాతం) ఏడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. కూరగాయలుసహా ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ ధరలు ఫిబ్రవరిలో తగ్గడం సానుకూలం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.44 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టోకు ద్రవ్యోల్బణ సూచీలో ప్రధాన మూడు విభాగాలనూ చూస్తే...
►ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.01 శాతం నుంచి 0.79 శాతానికి తగ్గింది.
►ఇందులో ఫుడ్ ఆర్టికల్స్ రేటు 2.55 శాతం నుంచి 0.88 శాతానికి తగ్గింది. జనవరిలో ఈ రేటు 3 శాతంగా ఉంది. ఒక్క కూరగాయలు ధరలు చూస్తే, జనవరిలో ధరల పెరుగుదల రేటు 40.77 శాతం ఉంటే, ఫిబ్రవరిలో ఈ రేటు 15.26 శాతానికి పడింది. పప్పు దినుసుల ధరలు పెరక్కపోగా 24.51 శాతం తగ్గాయి.
►ఇక నాన్–ఫుడ్ ఆర్టికల్స్ రేటు అసలు పెరక్కపోగా –2.66 శాతం తగ్గింది. 2017 ఫిబ్రవరిలో ఈ రేటు 4.65 శాతం.
►ఫ్యూయెల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం రేటు 25.17 శాతం నుంచి 3.81 శాతానికి తగ్గింది.
► తయారీ: ఈ విభాగంలో రేటు 3.23 శాతం నుంచి 3.04 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment