ఆధార్కు ఇన్ఫోకస్ స్మార్ట్ఫోన్ | Infocus to launch an Aadhaar-Enabled Iris Smartphone with STQC | Sakshi
Sakshi News home page

ఆధార్కు ఇన్ఫోకస్ స్మార్ట్ఫోన్

Published Tue, Dec 6 2016 12:35 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

ఆధార్కు ఇన్ఫోకస్ స్మార్ట్ఫోన్ - Sakshi

ఆధార్కు ఇన్ఫోకస్ స్మార్ట్ఫోన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న అమెరికన్ బ్రాండ్ ఇన్‌ఫోకస్ త్వరలో భారత్‌లో వినూత్న స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెడుతోంది. ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను ఇందులోని ఐరిస్ స్కానర్‌తో సులభంగా పూర్తి చేయవచ్చు. ఈ ఫోన్ రెండు సెకన్లలోనే కనుపాపను చిత్రిస్తుంది. 2017 ఫిబ్రవరిలోగా విడుదల కానున్న బింగో 20 (ఎం425) మోడల్ ధర రూ.12 వేలుంటుందని కంపెనీ తెలిపింది. భారత ప్రభుత్వం నుంచి స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేట్ కూడా పొందినట్టు వెల్లడించింది.

ఎస్‌టీక్యూసీ సర్టిఫికేషన్ ఉన్న ఉపకరణాలను బయోమెట్రిక్ ధ్రువీకరణ  కోసం ఉపయోగించే వీలుంటుంది. బ్యాంకింగ్, టెలికం, ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎంఎన్‌ఆర్‌జీఏ పేమెంట్స్, పాస్‌పోర్ట్, ట్యాక్సేషన్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయుక్తంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. చిత్రాల నాణ్యతకు ఐరిస్‌టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు ఇన్‌ఫోకస్ ఇండియా హెడ్ సచిన్ థాపర్ తెలిపారు. ఆధార్‌తో పాటు యూఎస్, కెన్యా, కొలంబియాలోని ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి ఐరిస్‌టెక్ పనిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement