దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2020గానూ వివిధ కంపెనీల్లో రూ.3,291 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ వార్షిక నివేదికలు నిర్ధారించాయి. తన అనబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్స్ గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరిలో అమెరికా ఆధారిత కంపెనీ సింప్లస్‌ను రూ.1,890 కోట్లకు సొంతం చేసుకుంది. మరో అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ పీటీఈ ఎఫ్‌వై 2020 ఏప్రిల్‌లో జపాన్‌కు చెందిన హిపస్‌లో 80శాతం వాటాను రూ.206 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే అనుబంధ సంస్థ ఏబీఎన్ ఏఎంఆర్ బ్యాంక్ సబ్సీడరీ సంస్థ స్టార్టర్‌లో 75 శాతం వాటాను రూ. 1,195 కోట్లకు చేజిక్కించుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో తెలిపింది. ఇక మార్చి 31 2020 నాటికి కంపెనీ 23 ప్రత్యక్ష, 52 అనుబంధ సంస్థలను కలిగి ఉంది.
కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తితో పలు ప్రాజెక్ట్‌ల రద్దు, దివాలా, క్లయింట్ల నుంచి ధరల ఒత్తిడి తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021)లో కంపెనీ లాభదాయకత, వృద్ది క్షీణించవచ్చని ఇన్ఫోసిస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment