
విజిల్‌బ్లోయర్ ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్
బెంగళూర్ : కంపెనీ సహ వ్యవస్ధాపకులు, మాజీ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలను దేశీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తోసిపుచ్చింది. కంపెనీలో సహవ్యవస్ధాకులు, మాజీ ఉద్యోగులపై వచ్చిన విజిల్‌బ్లోయర్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇన్ఫోసిస్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత నెలలో కంపెనీ ఉద్యోగులు కొందరు రాసిన విజిల్‌బ్లోయర్ లేఖలో ఉటంకించిన ఆరోపణలకు తాము ఆధారాలు అందుకోలేదని తెలిపింది. లాభాలు తగ్గుముఖం పడితే షేర్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ తమతో పాటు మరికొందరిని భారీ ఒప్పందాలకు అనుమతులు ఇవ్వరాదని ఒత్తిడి చేశారని ఆ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు.