న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమవుతోందని సమాచారం. వచ్చే నెల 11న జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో క్యూ3 ఆర్థిక ఫలితాలతో పాటు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదన కూడా పరిశీలించవచ్చని ఒక ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది. ఈ షేర్ల బైబ్యాక్ రూ.11,200 కోట్లు(160 కోట్ల డాలర్ల)మేర ఉండొచ్చని, షేర్ల బైబ్యాక్ ధర ప్రస్తుత ధర కంటే 20–25 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. ఈ షేర్ల బైబ్యాక్‌లో కంపెనీ వ్యవస్థాపకులకు చెందిన కుటుంబ సభ్యులు తమ షేర్లను విక్రయిస్తారని ఆ పత్రిక పేర్కొంది.
కాగా ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.13,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను పూర్తిచేసింది. కాగా స్పెషల్ డివిడెండ్ రూపంలో ఇన్వెస్టర్లకు రూ.2,600 కోట్లు చెల్లించనున్నామని ఇటీవలే ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డ్ వెల్లడించింది. మరో రూ.10,400 కోట్ల నగదును ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటాదారులకు చెల్లించనున్నామని, ఏ రూపంలో చెల్లించాలో డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయింస్తుందని పేర్కొంది. కాగా ఇటీవలనే ఐటీ దిగ్గజాలు–టీసీఎస్, విప్రో, కాగ్నిజంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మైండ్ ట్రీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి.
ఇన్ఫోసిస్ మరో షేర్ల బైబ్యాక్!
Published Tue, Dec 25 2018 12:37 AM | Last Updated on Tue, Dec 25 2018 12:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment