ఈ వారంలో రెండు ఐపీఓలు | IPO Grey Market Premium, GMP, GreyMarket Price & Discussion | Sakshi
Sakshi News home page

ఈ వారంలో రెండు ఐపీఓలు

Published Mon, Aug 1 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ఈ వారంలో రెండు ఐపీఓలు

ఈ వారంలో రెండు ఐపీఓలు

న్యూఢిల్లీ: దిలిప్ బిల్డ్‌కాన్, ఎస్ పి అప్పారెల్స్ -ఈ రెండు కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు ఈ వారంలో రానున్నాయి. సోమవారం(ఈ నెల 1న) ప్రారంభమయ్యే దిలిప్ బిల్డ్‌కాన్ ఐపీఓ బుధవారం(3న) ముగుస్తుంది. మౌలిక రంగానికి చెందిన దిలిప్ బిల్డ్‌కాన్ తన ఐపీఓకు రూ.214-219ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.430 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు కోటికి పైగా షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో జారీ చేయనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.654 కోట్లు సమీకరిస్తుందని అంచనా.  ఇక చిన్న పిల్లల నిట్టెడ్ దుస్తులు తయారు చేసే ఎస్ పి అప్పారెల్స్ ఐపీఓ మంగళవారం(2న) ప్రారంభమై గురువారం(4న) ముగుస్తుంది.

ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.215  కోట్ల విలువైన తాజా షేర్లను, 9 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేస్తారు. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.258-268గా కంపెనీ నిర్ణయించింది. ఈ  ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.456 కోట్ల పెట్టుబడులు సమీకరిస్తుందని అంచనా. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ 14 ఐపీఓలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement