కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధింపుతో భారత కార్పోరేట్ వ్యవస్థ ఇప్పటికీ కష్టాలను ఎదుర్కోటుంది. ఈక్విటీ మార్కెట్లు కూడా రోలర్-కోస్టర్ రైడింగ్‌ను చేస్తున్నాయి. ఐపీఓ మార్కెట్ ఇందుకు మినహాయింపు కాదు. 2012లో మొదటి తొలిభాగం తర్వాత అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చిన తొలి అర్థ సంవత్సరంగా నిలిచిపోయింది.
ఇష్యూకు ఒకే కంపెనీ మాత్రమే:
ప్రధాన విభాగపు కంపెనీలకు పరిగణాలోకి తీసుకుంటే ఈ ఏడాది మొదటి 6నెలల్లో కేవలం ఒకే ఒక్క కంపెనీ మాత్రమే ఇష్యూకు వచ్చింది. అది ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ కంపెనీ. ఇదే క్రమంలో ఐపీఓ ప్రక్రియను పూర్తి చేసుకున్న 17 కంపెనీలు ఎక్చ్సేంజీల్లో లిస్ట్ అయ్యాయి. చిన్న, మధ్య తరహా విభాగం నుంచి 16 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. గతేడాది ఇదే తొలిభాగంలో 35 కంపెనీలు ఎక్చ్సేంజ్‌లో లిస్ట్ అయితే, ప్రధాన విభాగం నుంచి 7 కంపెనీలు ఇష్యూకు వచ్చాయి.
వాస్తవానికి ఎస్‌బీఐ కార్డ్స్ ఇష్యూ అనంతరం చాలా కంపెనీలు ఐపీఐకు రావాల్సి ఉంది. కాని కోవిడ్-19తో వ్యాధి వ్యాప్తితో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం, ఈ ఏడాది జనవరి రికార్డు గరిష్టం నుంచి భారత ఈక్విటీ సూచీలతో పాటు ప్రపంచఈక్విటీ మార్కెట్లు 40శాతం నష్టాన్ని చవిచూడటం లాంటి అంశాలు ఐపీఓ రావాలనకున్న కంపెనీల ఆశలపై నీళ్లు చల్లాయి.
‘‘ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ బ్లాక్‌బ్లాస్టర్ సబ్‌స్క్రైబ్ అయిన తర్వాత కోవిడ్-19, పరిమితంగా ఉన్న లిక్విడిటీలతో ప్రైమరీ మార్కెట్ తీవ్ర ఒడిదుడులకు ఎదుర్కోంది. ఏడాది ప్రారంభంలో కొత్తగా పుట్టుకొచ్చిన కోవిడ్-19 ఆర్థిక కార్యకలాపాలను చేయడంతో పాటు, మార్కెట్ అస్థిరతకు దారితీసింది. ఫలితంగా ఫైనాన్షియల్ రంగంలో తీవ్రభయాలు నెలకొన్నాయి. అందుకే చాలా కంపెనీలు ఐపీఓలను వాయిదా వేసుకున్నాయి.’’ అని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే అభిప్రాయపడ్డారు.
బుక్ రన్నర్‌లు, ప్రమోటర్లు వెనకడుగు వేయడంతో పాటు డిమాండ్ లేమితో ఐపీఓ మార్కెట్ దారుణంగా దెబ్బతింది. సెకండరీ మార్కెట్ల బలహీనత, మార్కెట్లో నెలకొన్న ఆందోళనలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా అన్‌లాక్ ప్రక్రియతో మార్కెట్‌తో పాటు అన్ని విభాగాలు తిరిగి గాడిన పడుతున్నాయి. అయితే ఒక్క ప్రాథమిక మార్కెట్‌లో ఇంకా ఎలాంటి చలనం రావట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment